Vikram-Rich Rich – 33
Vikram-Rich Rich – 33
Vikram-Rich Rich – 33 | విక్రమ్-రిచి రిచ్ | boothu kathalu
Takulsajal
స్పృహ తప్పిపోయిన రుద్రని లిఖిత తన చేతుల్లోకి తీసుకుంది, విక్రమాదిత్య తన చెయ్యిని దేవి తల మీద పెట్టగానే దేవి మైకంలోకి వెళ్ళిపోయింది. అక్కడున్న అందరూ విక్రమాదిత్య కూర్చున్న గద్దె చుట్టూ చేరారు ఆయన్ని చూడ్డానికి.
విక్రమాదిత్య : అమ్మా
సంధ్య ఏడుస్తూనే ఉండిపోయింది..
సంధ్య : చిన్నా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయావు, నీ చిన్నతనంలో నేను లేక ఎంత బాధపడ్డావో అంత బాధని నేను అనుభవించాను చిన్నా.. ఇక నా వల్ల కాదు నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని ఏడుస్తూ ఇన్ని రోజుల తన బాధనంతా వెళ్లగక్కింది. అందరూ అది చూసి వాళ్ళ వాళ్ళ అమ్మతో ఉన్న ప్రేమని గుర్తు తెచ్చుకుని కళ్ళు తుడుచుకున్నారు.
విక్రమాదిత్య : ఇక నువ్వు నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు ప్రమాణం అంటూ సంధ్య నుదిటిన ముద్దు పెట్టుకుని అందరిని చూసి కావ్యా అని పిలవగానే కావ్య వచ్చి పక్కన నిలుచుంది.. లేచి నిలుచుని ఎంత పెద్దది అయిపోయింది నా బంగారం ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టమని అడిగితే బాగోదేమోరా అని నవ్వాడు.. పక్కనే ఉన్న విక్రమ్ తోపాటు తన తండ్రి కూడా కావ్య ఆనందం చూసి సలీమాతోపాటు అందరూ మురిసిపోయారు.
కావ్య లేచి తన నాన్నని గట్టిగా వాటేసుకుంది.. విక్రమాదిత్య తన కూతురు తల మీద చెయ్యి వెయ్యగానే చిన్న కాంతి ఎవ్వరికి కనిపించకుండా కావ్యలో కలిసిపోయింది.
కావ్య : నాన్నా.. ఎన్ని సంవత్సరాలు అయిందో ఈ మాట అని.. తన నోటి నుంచి మాట రాగానే అందరూ ఆశ్చర్యపోయారు కావ్య కూడా అందరిలానే ఆశ్చర్యపోయి గొంతు పట్టుకుని తన నాన్నని చూసింది.. కావ్య భర్త అయితే ఏడుస్తూ ఉండిపోయాడు..
కావ్య : నాన్నా.. నాన్నా.. అని ఆనందంగా గట్టిగ్గా అరుస్తూ తన భర్త చెయ్యి పట్టుకుని విక్రమాదిత్యని కౌగిలించుకుంది.. నాన్నా నిజంగా నాకు మాట రావడం.. అందులో నాన్న అని నేను మాట్లాడిన మొదటి మాట. అదీ.. నీ ముందర నిన్ను పిలుస్తూ.. చాలు నాన్నా చాలు.. అని కన్నీళ్లతో విక్రమాదిత్య భుజం తడిపేసింది.. మళ్ళి తేరుకుని కళ్ళు ముక్కు తుడుచుకుని ఎలా నాన్నా అని అడగగానే విక్రమాదిత్య తన అరచెయ్యి చూపించి మ్యాజిక్ అన్నాడు నవ్వుతూ.. ఇదంతా ఆనందంతో ఏడుస్తూ చూస్తున్న విక్రమ్ వెంటనే విక్రమాదిత్య కాళ్ళ మీద పడిపోయాడు.
విక్రమాదిత్య కాలి మీద విక్రమ్ కన్నీటి చుక్కలు పడగానే తల మీద చెయ్యి పెట్టాడు..
విక్రమాదిత్య : నీ కొడుకా
కావ్య : హమ్.. విక్రమ్ లే.. నాన్నా.. నా భర్త, నువ్వు నాతో ఉండుంటే అయన నన్ను చూసుకునే విధానం చూసి చాలా సంతోషించేవాడివి. ఇదిగో నా కొడుకు విక్రమ్.. నీ పోలికే
విక్రమాదిత్య : తెలుస్తుంది.. నీ తమ్ముడు చెల్లి ఎక్కడా
కావ్య పరిగెత్తుకుంటూ వెళ్లి తన తమ్ముడు రాజుని చెల్లెలు సరితని ఇరువైపులా పట్టుకుని విక్రమాదిత్య ముందుకు తీసుకొచ్చింది.
కావ్య : నాన్నా తమ్ముడు, చెల్లి
విక్రమాదిత్య ఇద్దరి చేతులు పట్టుకోగానే కధ మొత్తం కనిపించింది.. పక్కనే నిలుచున్న రాజు భార్యని చూసి ఎమ్మా కోడలా అన్నా చెల్లెళ్ళు ఇంకా మాట్లాడుకోవట్లేదా అనగానే ఆమె అటుఇటు చూసింది.. నిన్నే కోడలా మంజులా కదా.. ఇంటికి పెద్ద దానివి నువ్వే అయినప్పుడు వీళ్ళిద్దరిని చేరొక్క పీకు పీకొద్దా అనగానే రాజు సరితా తల దించుకోగా మంజుల నవ్వింది.
విక్రమాదిత్య : రాజు.. అంతా అయోమయంగా ఆశ్చర్యంగా ఉందా నేనొకటి గుర్తు చెయ్యనా అని నవ్వుతూ చెయ్యి చూపించగానే చేతిలోకి పచ్చి మామిడికాయ వచ్చింది.. ఇది గుర్తుందా నువ్వు చిన్నప్పుడు సరిత అడిగిందని చెట్టుకున్న పచ్చి మామిడికాయ కొయ్యబొతే అమ్మ నీ పిర్ర మీద గిచ్చింది.. అనగానే అందరూ నవ్వారు.. సరిత కూడా.. సరితా మీ అన్నయ్య నీకోసం ఎంత చేసాడో తెలుసా మీ అల్లరి తట్టుకోలేక అమ్మ ఒకసారి రాజుని బట్టలు విప్పేసి ఎండలో నిలుచోపెట్టింది, అనగానే అందరూ అందులో సరిత గట్టిగా నవ్వింది.. రాజు సరితని గిచ్చాడు.. ఇంకా ఏదో చెప్పబోతుంటే రాజు అందుకుని.. నాన్నా నాకంతా గుర్తొచ్చింది ఇంక చాలు.. నిజమేనా లేదా ఆ చెడ్డి మ్యాటర్ కూడా చెప్పి గుర్తుచెయ్యనా
రాజు : వామ్మో ఈయన నా పరువు తీయడానికే వచ్చాడు.. నాన్న నిజంగా నాకంతా గుర్తుంది అని పక్కనే ఉన్న సరితని గిచ్చగానే సరిత వదిలేయి నాన్నా అని నవ్వింది..
విక్రమాదిత్య : చెల్లి మాట్లాడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వదిలేస్తావా, దెగ్గరుండీ కాళ్ళు చేతులు కట్టేసి ఇంటికి తీసుకొచ్చి నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడితే నీ గుండె మీద వాళ్లిపోదు.. ఏం బంగారం
రాజు : సారీ.. సరితా సారీ
విక్రమాదిత్య : ఇంతకీ ఆదిత్య ఎడి?
కావ్య : ఇదిగో ఇక్కడే ఉన్నాడు అని వెళ్లి ఆదిత్యని ముందుకు తెచ్చి నాన్నా వీడు నీ పోలికే.. ఇదిగో ఇది అను.. అమ్మ పేరే
విక్రమాదిత్య : అమ్మ లాగే లక్షణంగా ఉంది.. విక్రమ్ మరి నీ భార్య ఎక్కడా అని అడగ్గానే అప్పుడే అక్కడికి ఒక క్యాబ్ వచ్చి ఆగింది. అందులోనుంచి మానస సుబ్బు ఇద్దరు దిగారు. రక్ష సుబ్బు వైపు చూసి నవ్వు ఆపుకోవడం విక్రమాదిత్య గమనించి వచ్చిన సుబ్బు వైపు చూసాడు.
విక్రమ్ : తనే మానస.. నా భార్య
విక్రమాదిత్య తనని చూస్తూనే కొంచెం జాలిగా సారీ అని మానసకి మాత్రమే వినపడేలా చెప్పాడు.. మానస షాక్ అయినా తేరుకుని చూసి చిన్నగా నవ్వి పలకరించింది.
విక్రమాదిత్య : తనెవరు అని అక్షితని చూడగానే.. నా కూతురు నాన్నా అని రక్ష జవాబు ఇచ్చింది
అక్షిత ముందుకు రాగానే విక్రమాదిత్య తన చెయ్యి పట్టుకుని తన గతం తెలుసుకుని వెనకాలే నిలుచున్న చిరంజీవిని చూసాడు.
విక్రమాదిత్య : చిన్నా ఇలా రా అనగానే చిరంజీవి ముందుకు వచ్చాడు చెయ్యి చాపితే చెయ్యి ఇవ్వలేదు.. నవ్వుకుని అంతా గమనిస్తూనే ఉన్నావన్నమాట
చిరంజీవి : మీరు ఎవరిని ముట్టుకుంటే వాళ్ల కధ మీకు తెలిసిపోతుంది
విక్రమాదిత్య : అయితే నీ రహస్యాలు నాకు తెలిసే వీలు లేదంటావ్
చిరంజీవి : లేదు
విక్రమాదిత్య : అయితే పాకిస్థాన్ లో జుబేదా.. రుబీనా.. సల్మా.. ఆఫ్ఘానిస్తాన్ లో అఫ్సూన్.. దంస.. ఫర్హానా.. అమెరికాలో ఒలీవియా.. సోఫియా.. దుబాయ్ లో ఇసాబెల్లా.. నూర్ వీళ్లందరి గురించి కూడా నాకు తెలీదు అన్నమాట
అంతే చిరంజీవి మోకాళ్ళ మీద కూర్చుని తనలో తానే నవ్వుకంటూ తల వంచి ఐ సర్రేన్డర్ అన్నాడు.. దానికి విక్రమాదిత్య నవ్వుకున్నాడు.
అక్షిత : ఎవరు వాళ్లంతా.. ఒరేయి అని అరవగానే చిరంజీవి మోకాళ్ళ పోసిషన్ నుంచి తల మీద చేతులు పెట్టుకుని నమస్కరిస్తూ అష్టాంగ నమస్కారం చేసాడు ఎవ్వరికి మొహం కనిపించకుండా ఏడుస్తూ నవ్వుతూ.. తనని తనే తిట్టుకుంటూ.. అందరూ నవ్వుకుంటే అక్షిత కసురుకుంటూ బైటికి మాత్రం నవ్వింది.
కావ్య : నాన్నా మీ చెయ్యి అంది కంగారుగా..
ఇందాక రుద్ర మూడో నేత్రం నుంచి వచ్చిన భస్మం విక్రమాదిత్య తన చేత్తో మళ్లించినప్పుడు కాలింది.. అది చూసుకుని రుద్రని చూసాడు.. ఇంకా లిఖిత ఒళ్ళోనే పడుకుని అప్పుడే మెలుకువ వచ్చి లేచి చూసాడు.
విక్రమాదిత్య : అది పోదులే.. ఎం కాలేదు వదిలేయి.. అని లేచి అందరిని పలకరించి వాసుని చూసి మీ వాళ్ళందరూ జాగ్రత్తగానే ఉన్నారు.. ఆ.. వాసు ఇంకో విషయం మీ ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెట్టబోతుంది అని పద్మ తల మీద చెయ్యి పెట్టి.. నాలాగే నీకు ఇద్దరిని విన్నాను.. వాసు చిన్నగా నవ్వాడు.. నీ మొదటి భార్యకి కొడుకు పుడతాడు.. అని చెపుతూ అందరిని పలకరిస్తూ చివరిగా చిరంజీవి దెగ్గరికి వచ్చాడు
చిరంజీవి : మళ్ళీ ఏ తిరకాసు పెడతాడో ఏంటో అనుకుంటుండగానే
విక్రమాదిత్య : గుర్తుపెట్టుకో నీ రహస్యాలు ఎవ్వరికి తెలియనంత వరకే నీకు బతుకైనా, ఆనందమైనా తెలిసిందో.. కష్టాలు చావులు తప్పవు
చిరంజీవి : మా అమ్మకి తెలుసు
విక్రమాదిత్య : ఇలా రా.. అని చిరంజీవి నుదురు పట్టుకుని ఉఫ్ అని ఊదాడు.. ఇంతటితో నువ్వు ఒక ఏజెంట్ వని ఇక ఈ లోకంలో ఎవ్వరికి తెలీదు.. మీ అమ్మగారికి కూడా గుర్తు ఉండదు.. మళ్ళీ చెప్పకు అని కొంచెం సీరియస్ గానే చెప్పాడు.. వెళుతూ మళ్ళీ వెనక్కి తిరిగి రహస్యం నీదెగ్గర ఉన్నంత వరకే అది నీకు బానిస బైటికి వెళ్లిందో నువ్వు దానికి బానిస అవుతావు. పొరపాటున కూడా నీగురించి ఎవ్వరికి చెప్పొద్దు.. చాలా తీవ్రంగా నష్టపోతావు అని అక్షితని చూసాడు
చిరంజీవికి చాలా వరకు విక్రమాదిత్య ఎం చెపుతున్నాడో అర్ధమైంది. ఇంతలో చిరంజీవికి ఫోన్ వచ్చి చూసాడు.. అమ్మ..?
చిరంజీవి : అమ్మా..
పార్వతి : ఎక్కడ చచ్చావ్ రా.. మీ అన్నా వదినా నిన్ను అడుగుతున్నారు, పెళ్లి తరవాత వాళ్ళకి, మాకు కనిపించలేదు ఎక్కడ జల్సా చేస్తున్నావ్?
చిరంజీవి : (అంటే అమ్మకి ఏమి గుర్తులేవు ఆయన చెప్పిందంతా నిజమే..) అమ్మా చిన్న పార్టీలో ఉన్నాను అయిపోగానే వచ్చేస్తాను.
పార్వతి : నువ్వు మారవు.. సంకనాకిపోతానంటే ఎవడు మాత్రం ఏం చేస్తారు.. నీ ఖర్మ అని పెట్టేసింది.
విక్రమాదిత్య నేరుగా వెళ్లి పక్కన ముభావంగా నిలుచున్న సుబ్బు భుజం మీద చెయ్యి వేసి నడిపించుకుంటూ పక్కకి వెళ్ళాడు.. అందరూ వీళ్లిద్దరి వైపే చూస్తున్నారు.. సుబ్బు వెనక ఉన్న అందరివైపు చూసాడు..
విక్రమాదిత్య : వాళ్ళవంక ఏముందిలే.. ఒకటి చెప్పు ఇంకా ఎంతమంది అమ్మాయిల వంక పడతావు
సుబ్బు : నేన్.. నేను.. అదీ..
విక్రమాదిత్య : అమ్మాయిలు అయిపోయి చివరికి ఆంటీల దెగ్గరికి వచ్చేసావ్.. నీ తాహతుకు మించి చాలా చేసావు.. నీకొక వరం ఇస్తాను కోరుకో.. అని ఆ వెంటనే.. మీ అమ్మతో మాట్లాడాలని ఉందా అని అడిగేసరికి సుబ్బు ఆశ్చర్యంగా చూసి ఆగిపోయేసరికి సుబ్బుని వదిలేసి ఎదురుగా నిలుచుని నవ్వాడు
సుబ్బు మొహం పీక్కుపోయింది బాధతో, కళ్ళలో నీళ్ల వల్ల వాడి కళ్ళు మెరుస్తున్నాయి.
విక్రమాదిత్య : ఆ ఇంట్లోకి వెళ్ళు మీ అమ్మతో మాట్లాడుకో అనేసరికి సుబ్బు కాళ్ళు ఒక్కసారి వణికి వెనక్కి తిరిగి ఇంట్లోకి పరిగెత్తాడు.
విక్రమాదిత్య రుద్ర దెగ్గరికి వెళ్ళాడు.. రుద్ర ఎదురుగా ఉన్న దేవి వంకే చూస్తున్నాడు. విక్రమాదిత్య లిఖితని చూసి సైగ చెయ్యగానే సుబ్బు అమ్మ గారి అవతారంలోకి మారి మాయం అయ్యి లోపల ఇంట్లో సుబ్బు ఉన్న చోట ప్రత్యక్షమయింది.
సుబ్బు : అమ్మా నువ్వేనా అని గట్టిగా వాటేసుకున్నాడు ఏడుస్తూ
లిఖిత : సుబ్బు ఇలా చూడు.. ఈ అమ్మకి ఎప్పుడు ఏడవను అని మాటిచ్చావా లేదా
సుబ్బు : లేదమ్మా నేను ఎప్పుడు ఏడవలేదు.. ఇప్పుడే నిన్ను చూడగానే ఆగట్లేదు.. నువ్వు చెప్పినట్టే బాగా చదువుకున్నానమ్మా కానీ నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం అందుకే చెప్పుకోదగ్గ ఉద్యోగం చెయ్యట్లేదు. కానీ నువ్వు కోరుకున్నట్టే చాలా మంచి వాళ్ళని ఆప్తులుగా సంపాదించుకున్నాను అమ్మా.
మానస అక్క లాగ.. విక్రమ్, ఆదిత్య ఇద్దరు నన్ను తమ్ముడిలా చూసుకుంటారు. అరవింద్ నా ఫ్రెండ్ ఇక్కడ లేడు వాడే నా బెస్ట్ ఫ్రెండ్. వాసు అన్నయ్య.. చిరంజీవి అన్నయ్య.. ఇక అక్షిత తనతో ఉంటె నీతో ఉన్నట్టే ఉంటుంది.. చాలా మంచిది.. నన్ను వాళ్ళ సొంత మనిషిలా చూసుకుంటారు.
లిఖిత : మరి నీ లవ్ గురించి చెప్పవా
సుబ్బు : కళ్ళు తుడుచుకుని.. లేదమ్మా నువ్వు నా పక్కన ఉండుంటే కనీసం అమ్మాయిలతో ఎలా మెలగాలో తెలిసేది.. అలాంటిదేమి లేదు
లిఖిత : మరి రక్ష
సుబ్బు : లేదు ఏమి లేదు.. అని మోకాళ్ళ మీద కూర్చుని లిఖిత ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చేశాడు
లిఖిత : చూడు బంగారం.. మనస్ఫూర్తిగా ప్రేమించినవాళ్లు నీకు దెగ్గర కాకుండా ఉండలేరు.. నన్ను నమ్ము
సుబ్బు : నిజంగానా
లిఖిత : ఒట్టు
సుబ్బు : అమ్మా నిన్ను ముద్దు పెట్టుకోనా
లిఖితా : అడగాలా నాన్నా రా.. అని దెగ్గరికి తీసుకోగానే గట్టిగా వాటేసుకుని ఇన్ని సంవత్సరాల బాధని ఏడుపుని మొత్తం తీర్చుకున్నాడు.
లిఖిత కూడా సుబ్బు ఏడ్చేంత వరకు వాడి వీపు నిమురుతూనే ఉంది. ఒక ఐదు నిమిషాలకి సుబ్బు తేరుకుని తనివితీరా తన అమ్మని చూసుకున్నాడు.
లిఖిత : ఇక నేను వెళ్ళనా సుబ్బు..
సుబ్బు : ఎక్కడికి.. అని ఏడ్చేస్తూ.. నేను వదలను.. అమ్మా ప్లీజ్ మా నన్ను వదిలి వెళ్ళకు.. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని కాళ్ళు పట్టుకున్నాడు గట్టిగా. సుబ్బు ప్రాణం పోయేలా ఏడుస్తూ బతిమిలాడుకోవడం చూడగానే లిఖితలోని రాక్షస గుణాలు పూర్తిగా చచ్చిపోయి తను కూడా ఏడ్చేసింది.
లిఖిత : సుబ్బు.. తప్పదు కదా నాన్నా.. ఇటు చూడు బైట లిఖిత అని ఒకావిడ ఉంది కదా తనతో నేను మాట్లాడాను నిన్ను కొడుకుగా స్వీకరిస్తానని బైటున్న విక్రమాదిత్యతో పాటు నాకు కూడా మాటిచ్చింది.
సుబ్బు : ఎవరు తను అని ఏడుస్తూనే అడిగాడు
లిఖిత : సుబ్బు కళ్ళని తుడుస్తూ.. తను ఒకప్పటి నా ఫ్రెండ్ నిన్ను నేను ఎలా ప్రేమగా చూసుకునేదాన్నో అలానే చూసుకుంటుంది.. నేను పంచినంత ప్రేమని పంచుతుంది.. నేను ఇక్కడ ఉండటం కుదరదు కదా అందుకే నా బదులు తనని నా స్థానంలో పెట్టి వెళుతున్నాను
సుబ్బు : కానీ తానెవరో కూడా నాకు తెలీదే
లిఖిత : ఒకప్పుడు వీళ్ళు నీకు తెలుసా.. ఇది కూడా అంతే నాన్నా.. వెళ్లి నోరు తెరిచి అమ్మా అని ఒక్కసారి పిలిస్తే నీ దెగ్గర వాలిపోదు?
సుబ్బు : అలాగే.. కాని నాకు నువ్వు మళ్ళీ కనిపించవు కదా?
లిఖిత : లేదు నాన్నా.. ఇక నన్ను లిఖిత లోనే చూసుకో సరేనా?
సుబ్బు : అలాగే.. కానీ నువ్వే నా బెస్ట్ అమ్మవి.. అని కౌగిలించుకున్నాడు.
లిఖిత : నాకు తెలుసు.. అని నుదిటిన ముద్దు పెట్టుకుని ఇక వెళ్ళనా
సుబ్బు : కళ్ళు తుడుచుకుని.. తన నవ్వు మొహం చూపించి బై అని చెయ్యి ఊపాడు
లిఖిత : ఎప్పుడు ఈ నవ్వుని వదలద్దు అని తల మీద చెయ్యి వేసి మాయం అయిపోయింది..
సుబ్బు బైటికి వచేసాడు కానీ లిఖిత మళ్ళీ లోపలే కూర్చుని దిగులుగా ఏడుస్తుంది.
విక్రమాదిత్య : రుద్రా ఇక నేను వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది, నీకు నా ధన్యవాదాలు.. ఇక సెలవు
రుద్ర : ఇందాక నాకు ఏమైంది?
విక్రమాదిత్య : అన్ని సమాధానాలు నీకు పరుశురాముడిని కలిసాక అవగతమవుతాయి.. కొన్ని రోజులు ఇంట్లో వాళ్ళతో గడిపి నీ తదుపరి ప్రయాణం కొనసాగించు
రుద్ర : మరి మీరు ?
విక్రమాదిత్య : నేను తిరిగి అక్కడికే వెళ్ళిపోతున్నాను
రుద్ర : ఎందుకు మీకు మీరే శిక్ష వేసుకున్నారు?
విక్రమాదిత్య నవ్వాడు తప్పితే ఇంకేం మాట్లాడలేదు
రుద్ర : ఇక ఈ దేవి ?
విక్రమాదిత్య : నాతో పాటే తీసుకెళతాను అని దేవిని చూడగానే దేవి భయంగా ఇద్దరి వంకా చూసింది.. ఒక్క నిమిషం అని మాయమయ్యి ఇంట్లో ఏడుస్తున్న లిఖిత ఎదురు ప్రత్యక్షమయ్యాడు
లిఖిత : చేతులు ఎత్తి దణ్ణం పెట్టింది
విక్రమాదిత్య : నీకు బిడ్డలు పుడితే రాక్షసులు పుడతారనే కదా ఆ ప్రయత్నం మానుకున్నావు.. అందుకే నీకు ఈ బిడ్డని కానుకగా ఇచ్చాను
లిఖిత : కృతజ్ఞరాలిని
విక్రమాదిత్య : ఏ కల్మషం ఎరుగని సుబ్బు నీలో ఉన్న రాక్షస గుణాలన్నీ చెరిపేసినట్టున్నాడు? నాకు నీలో ఏ చెడ్డ గుణాలు కనిపించటం లేదు
లిఖిత అవునని తల ఊపుతూ కళ్ళు తుడుచుకుని విక్రమాదిత్యని ముట్టుకోబోయి ఆగిపోయింది.
విక్రమాదిత్య : ఆగిపోయావే
లిఖిత : నేనొక రాక్షస జాతికి సంబంధించిన దాన్ని
విక్రమాదిత్య : నేను అందరివాడిని అయినా నీలో ఆ గుణాలు శాశ్వతంగా చచ్చిపోయాయి, కొన్నిటిని నేను నిన్ను మొదటి సరి రుద్ర గుండె దెగ్గర ముట్టుకున్నప్పుడే చెరిపేసాను.. అనగానే లిఖిత వంగి విక్రమాదిత్య కాళ్ళకి మొక్కి లేచింది.
విక్రమాదిత్య బైటికి వచ్చి అందరిని చూసి రక్ష వైపు చూసాడు, అక్కడున్న ప్రతీ ఒక్క జంట ఒకరి చేతులలో ఒకరు చెయ్యి వేసుకుని సంతోషంగా చూస్తున్నారు.
విక్రమాదిత్య : ఇక సెలవు అని సంధ్యని చూసాడు.. అమ్మా నేను చెప్పినట్టుగానే చూసావా నీ చుట్టు ఎంతమంది ఉన్నారో.. ఇప్పుడు చెప్పు వచేస్తావా నాతో అనగానే సంధ్య ఆనందంగా అందరిని ఒకసారి చూసి అందరిని కౌగలించుకుని ఇన్నేళ్లు ఉన్న ఇంటిని ఒకసారి చూసుకుని రక్షకి అప్పగించి తిరిగి కొడుకు వైపు చూసింది సిద్ధంగా
సంధ్య : ఎంత మంది ఉన్నా నువ్వు లేకపోతే నా కడుపు కోత ఎవ్వరు తీర్చలేనిది.
విక్రమాదిత్య చెయ్యి చూపించి ఆశీర్వదించగానే సంధ్య శరీరం మాయమయ్యి చిన్న వెలుగు ఒకటి విక్రమాదిత్య గుండెలో కలిసిపోయింది.. అక్కడున్న అన్ని జంటలు పిల్లలు చేతులెత్తి మొక్కగా నవ్వుతూ వెనక్కి తిరిగి దేవిని చూసి తన మెడకి ఉన్న పాముని విప్పాడు.
విక్రమాదిత్య : మంజీరా… ఇబ్బందిపెట్టానా అని నవ్వి పాముని వదిలేసి దేవి చెయ్యి పట్టుకుని రక్షని చూసాడు.. రక్షా నాకు ఇంకేమైనా చెప్పాలా అని అడిగాడు.
రక్ష సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్లి సుబ్బు చెయ్యి పట్టుకుని లాక్కెళ్లి తన తండ్రి ముందు నిలుచుంది.. విక్రమాదిత్య అరచెయ్యి చూపించి తధాస్తు అనగానే సుబ్బు చేతిలో పసుపు తాడు ప్రత్యక్షమయింది.. సుబ్బు ఇంకా కప్పలా నోరు తెరుచుకుని అలానే చూస్తున్నాడు.
రక్ష : కట్టు అని ఆశ్చర్యపోతున్న సుబ్బుని చూసి నవ్వింది.
సుబ్బు ఆశ్చర్యంగా తాళి కడుతుంటే అక్కడున్న ప్రతి ఒక్క మగాడు ఆశ్చర్యంగా దవడలు కింద నేలకి తగిలేలా తెరిచారు నోళ్లు.. విక్రమాదిత్య ఆశీర్వదిస్తూ అక్షింతలు వెయ్యగా.. రుద్ర కూడా లిఖిత సమేతంగా అక్షింతలు వేసి ఆశీర్వదించాడు.. లిఖిత చిటికె వెయ్యగానే అందరి చేతుల్లోకి అక్షింతలు వచ్చేసాయి.. అందరూ సంతోషంగా అక్షింతలు వేస్తుంటే చిరంజీవి, వాసు, విక్రమ్, ఆదిత్య మాత్రం అసూయగా అక్షింతలు వెయ్యడం చూసి సుబ్బు నవ్వుకున్నాడు.. మానస అయితే తన కళ్లెదురు జరుగుతుంది చూసి గాల్లోకి ఎగురుతూ కేరింతలు కొడుతూ మనస్ఫూర్తిగా అక్షింతలు వేసింది.
విక్రమాదిత్య వెళ్లిపోతుండగా సుబ్బు పరిగెత్తుకుంటూ వెళ్లి తన కోరిక కోరాడు.. విక్రమాదిత్య అది విని గట్టిగా నవ్వుతూ.. ఆఖరికి నన్ను కూడా నవ్వించావే.. నీ కోరిక తీరుతుంది తధాస్తు అని మాయం అయిపోయాడు.. సుబ్బు కోరిన కోరిక విని రుద్ర కూడా నవ్వుకుంటూ తన వాళ్ళని తీసుకుని గాల్లోకి ఎగిరి వెళ్ళిపోయాడు.
సుబ్బు వెనక్కి తిరగగానే అందరూ సుబ్బు చుట్టూ చేరారు
రక్ష : మా నాన్నతో ఎం మాట్లాడావు??
అక్షిత : వీడు ఏదో అడిగాడు దానికి ఆయన నవ్వి తధాస్తు అన్నాడు.. రేయి ఎం కోరుకున్నావ్??
ఆదిత్య : చెప్పరా
మానస : రేయి చెప్తావా లేదా
సుబ్బు నవ్వుతూ : అంగ పార్ అనగానే అందరూ వెనక్కి తిరిగి చూసారు.. అక్కడ నుంచి ఇంటి గడప వరకు ఉన్న అమ్మాయిలని అంటీలని చూసి దడుచుకున్నారు అంతా..
సుబ్బు : మీరు కూడా వెళ్లి వరసలో నిలుచోండి.
అనురాధ : మేమా మేమెందుకు?
సుబ్బు : నేను ప్రొపోజ్ చెయ్యాలనుకున్న వాళ్ళు, నన్ను చూసి నవ్వినవాళ్లు, నన్ను రిజెక్ట్ చేసినవాళ్లు నన్ను వాడుకున్న ప్రతీ ఒక్కళ్లని కోరుకున్నాను అని నవ్వుతూ చెప్పాడు.
అక్షిత : దొబ్బేయి.. ఎలా కనిపిస్తున్నామురా నీకు.. వీడికి బాగా ఎక్కువైంది అందరూ కలిసి నాలుగు తగిలించండి.
సుబ్బు : అక్షితా ఆగక్కడా
అక్షిత : నన్నే పేరు పెట్టి పిలుస్తావా
సుబ్బు : నీకింకా నా రేంజ్ అర్ధంకావట్లేదు పాపా.. నా మీద చెయ్యేసే ముందు నా భార్యని చూడండి.. అక్కడ గొడ్డలి కనిపిస్తుందా.. అనగానే అక్షిత చిన్నబోయింది.. అయినా ఈ కధకి అస్సలు హీరోని నేనే
అక్షిత : అబ్బా ఛా
సుబ్బు : మీరంతా రూంలో కూర్చుని ఏడుస్తుంటే వచ్చి కాపాడింది ఎవరు?
వెనకున్న అందరి వైపు చూసి ఎవరండీ మిమ్మల్ని ప్రాణాలకి తెగించి కాపాడింది అని అరవగానే సలీమా నువ్వే అన్నయ్యా అని అరిచింది నవ్వుతూ..
సుబ్బు : వినిపించట్లా గట్టిగా అనగానే కావ్యతో సహా అందరూ నవ్వుతూ నువ్వే అని అరిచారు..
అక్షిత ఇంకా ఆశ్చర్యంగా నోరు తెరిచి చూస్తుంటే
సుబ్బు : హలో పాపా అని అక్షిత ముందు చిటికె వేసి.. చూసావా అది మన ఫ్యాన్ ఫాలోయింగ్.. ఎమ్మా చిరంజీవి, వాసు, విక్రమ్, ఆదిత్య మిమ్మల్ని కుక్కని కొట్టినట్టు కొడితే ఎవరు కాపాడింది..?
చిరంజీవి సుబ్బు వేషాలు చూసి నవ్వుకుంటుంటుంటే వాసు ఏంట్రా అంటూ ముందుకు వచ్చాడు
సుబ్బు : ఏయి ఆగక్కడా.. నా వెనక ఎవరున్నారో తెలుసుగా అని రక్ష వెనక్కి వెళ్లి దాక్కున్నాడు..
రక్ష నవ్వుకుంది..
సుబ్బు : చెప్పాలి చెప్పాలి ముహూర్తం దెగ్గర పడుతుంది.
ఆదిత్య : నువ్వేరా బాబు మమ్మల్ని కాపాడింది ఇకపో..
సుబ్బు : విక్రమ్ చెప్పట్లా
విక్రమ్ : మమ్మల్ని కాపాడింది నువ్వేనయ్యా మహానుభావా.. ఇక దయచెయ్యి అని దారి చూపించాడు.
సుబ్బు : రా బంగారం.. వీళ్ళతో మనకేంటి.. అక్షితా వెళ్లి ముందు వరసలో నిలుచో
అక్షిత : నేను వెళ్ళను
సుబ్బు : నీకు వేరే ఆప్షన్ లేదమ్మా.. మావయ్యా.. అని అరవగానే అక్షిత, మానస, అనురాధ కూడా వాళ్ల ప్రమేయం లేకుండానే అందరికంటే మొదటగా నిలుచున్నారు.. పద్మ ఒక్కటే బతికిపోయింది.. వాసు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.
అనురాధ : సుబ్బు నేనేం చేసానురా
సుబ్బు : నన్ను వాయిలాహట్ అని మోసం చెయ్యాలె.. మర్చిపోయాననుకున్నావా అనగానే అనురాధ కళ్ళుమూసుకుని తనని తానే తిట్టుకుంది.
సుబ్బు రక్ష చెయ్యి పట్టుకుని అటు ఇటు తన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రేమించిన అక్షిత, మానస, అనురాధతో కలిపి మొత్తం ఐదు వందల పద్దెనిమిది (518) మంది ఇష్టం లేకుండా మొహం మాడ్చుకుని చేతిలో పూలతో రెడీగా ఉన్నారు.
సుబ్బు మొదటి అడుగు రాక్షతో పాటు వెయ్యగానే అటు మానస ఇటు అక్షిత నిలుచొని ఉన్నారు.
మానస : అక్కని రా
సుబ్బు : ఈ విషయంలా తగ్గేదేలే
అక్షిత : నీ సంగతి తరవాత చెపుతా అని చేతిలో ఉన్న పూలని సుబ్బు మొహం మీద విసిరింది
సుబ్బు : థాంక్స్ పాపా.. నాకు అదే కావాలి మొదట నువ్వే పూలు చల్లాలి అనుకున్నాను
అక్షిత : యదవ అని తిట్టుకుంది
కొత్త జంట అయిన సుబ్బు రక్ష ఇంట్లోకి నడుస్తూ అందరూ వాళ్ల మీద పూలు చల్లుతుంటే ఒక్కొక్కరి మొహం వంకా చూస్తూ గర్వంగా తల ఎత్తి రక్షని తీసుకుని విక్రమాదిత్య ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకోగానే అందరూ మాయం అయ్యారు.
అక్షిత మానస అనురాధ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.. ఇక అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు.. ఒక పక్క ఆదిత్య ఫామిలీ.. ఆదిత్య వాళ్ల నాన్న తన చెల్లిని వదలకుండా చెయ్యి పట్టుకున్నాడు.
ఇంకో వైపు విక్రమ్ కుటుంబం ఆ పక్క వాసు పద్మ, ఆ పక్కనే చిరంజీవి అందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోడానికి బైలుదేరారు.
అక్షిత : అవును.. అందరూ వాడు కోరుకున్నట్టు వచ్చారు కానీ ఆ అమ్మాయి, అదే మన సుబ్బుని మోసం చేసిన తన మరదలు రాలేదేంటి?
అనురాధ : అవును కదా నాకు కనిపించలేదే తన పేరేంటి శరణ్య కదా
మానస : ఆ అమ్మాయి చేసిన తప్పులు తెలుసుకుని ఇంట్లో వాళ్ల ముందు తల ఎత్తుకోలేక ఆత్మహత్య చేసుకుంది
అక్షిత : ఓహ్..
చిరంజీవి : అక్షితా..
అక్షిత : వస్తున్నా.. మళ్ళీ ఎప్పుడు కలిసేది అందరం?
అనురాధ : అందరి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి.. ముందు మన జీవితాలు చక్కపెట్టుకుని ఆ తరువాత ఒకరోజు చూసుకుని కలుసుకుందాం
మానస : అవును ఎలాగో మన సుబ్బు గాడి రిసెప్షన్ పెట్టుకోవాలి కదా
అక్షిత : సంగీత్ కూడా పెట్టుకుందాం.. అని అందరికి బై చెప్పి చిరంజీవి దెగ్గరికి వెళ్ళింది.. ఏంట్రా ఇంకా మొహం అదోలా పెట్టావ్
చిరంజీవి : ఆ సుబ్బు గాడే వాడిని చూస్తే అసూయగా ఉంది
అక్షిత : మీ అందరికంటే అందమైన భార్య వాడికి దొరికిందని కుళ్ళు.. మగ బుద్ధి ఎక్కడికి పోద్ది అని కసిరింది చిరంజీవి మొహం చూసి.
చిరంజీవి : అది కాదే వాడు పిల్లని ట్రై చేసాడు, కానీ దాని తల్లి పడింది.. అదే బాధగా ఉందే.. పిల్లని కొడితే తల్లి బుట్టలో పడిందన్న సామెతని వాడు నిజం చేసి చూపించాడు.
అక్షిత కోపంగా వెళుతుంటే వెనకే మానస, అనురాధ, పద్మ కోపంగా రావడం చూసింది.
అక్షిత : మీది కూడా అదేనా
మానస : అదే.. కుళ్ళుబోతు మొహాలు అని నలుగురు కోపంగా ముందు వెళుతుంటే వెనక నలుగురు బతిమిలాడుకుంటూ పెళ్ళాల వెనక పడ్డారు , తప్పైపోయింది క్షమించమంటూ.. వెనక ఉన్న అందరూ అది చూసి నవ్వుకున్నారు.
128C