నేను చెప్పబోతున్న విషయాన్ని వినడానికి అందరూ సిద్దంగా ఉండగా వారితో నేను మాట్లాడుతూ “
నేను పుట్టింది ఎక్కడో నాకు తెలియదు కానీ, నేను పెరిగింది మొత్తం వైజాగ్ లో. నా చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో వైజాగ్ లోని ఒక ఆశ్రమం లో పెరిగాను. అక్కడే ఉంటూ డిగ్రీ వరకు చదువుకున్నా. అలా చదువుకుంటూ అవకాశం ఉన్నప్పుడల్లా చేతికి దొరికిన పని చేస్తూ ఉండేవాడిని. డిగ్రీ అయిపోయాక ఆశ్రమం నుంచి బయటకి వచ్చి ఏదైనా ఉద్యోగం చేద్దాం అని అనుకున్నా. కానీ , ఈ సమాజంలో ప్రతిభతో పనిలేకుండా డబ్బు ఉంటేనే ఉద్యోగం అని అర్ధం చేసుకునే సరికి నా జీవితం రోడ్డు మీదకి వచ్చేసింది.
ఒక పూట తింటూ కూలి పనికి పోతూ ఒక రెండు సంవత్సరాలు దాకా గడిపాను. అప్పటికే నా పరిస్తితి ఎటూ తోచలేని స్తితిలో ఉండగా విజయవాడలో కేటరింగ్ పనిలో హెల్పర్ గా కొంత మంది కావాలనే ఒక ప్రకటన చదివాను. విజయవాడ వెళ్లాలని నిర్ణయించుకొని నా దగ్గర ఉన్న 500 వందలు చేతిలో పట్టుకొని చివరికి విజయవాడ చేరుకున్నాను. నేను విజయవాడ చేరిన రోజు , ఇప్పటి నుంచి సరిగ్గా 15 రోజుల వెనుక.
ఎట్టకేలకు ఆ కేటరింగ్ పనిలో చేరడానికి ఆ ఆడ్రస్ దగ్గరకి , రోడ్డు మీద ఒక పక్కగా వెళ్తూ ఉండగా ఒక కార్ నన్ను వెనుక నుంచి గుద్ది ఆపకుండా వెళ్ళిపోయింది. ఆ గుద్దడం గుద్దడం గాల్లో ఎగిరి రోడ్డుకు ఉన్న డివైడర్ పక్కన పడ్డాను. తలకి ఏదో బలమైన దెబ్బ తగిలింది అని నాకు తెలిస్తూ ఉండగా నా కళ్ళు నెమ్మదిగా మూతపడడం మొదలయ్యాయి.
నా కళ్ళు పూర్తిగా మూతపడని కొద్ది క్షణాలలో ఒక అమ్మాయి నా దగ్గరకి వచ్చి నా తలని తన చేతులతో పట్టుకొని అప్పుడే ఆంబులెన్స్ కి ఫోన్ చేయడం నేను వినిన చివరి మాట . ఆ తరువాత మైకంలోకి వెళ్లిపోయాను. ఇక నేను కళ్ళు తెరచి చూసే సరికి నా ముందు ఒక అమ్మాయి డాక్టర్ కోట్ వేసుకొని నిల్చొని నేను కళ్ళు తెరవడం చూస్తూ నాతో ‘నేను కనిపిస్తున్నానా ? నా మాటలు వినిపిస్తున్నాయా ?’ అని నాతో అంటూ ఉంది.
ఆ క్షణం ఆ అమ్మాయి గొంతు నాకు చాలా స్పష్టంగా వినిపించడంతో ఆ గొంతుని నేను గుర్తు పట్టాను. నేను స్పృహ కోల్పోయే ముందు వినిన అదే గొంతు ఈ అమ్మాయి గొంతు ఒకటే , ఆ రోజు ఆంబులెన్స్ కి ఫోన్ చేసిన ఆ అమ్మయి కచ్చితంగా ఈ అమ్మాయే అని నాకు అర్ధం అయింది.
నేను కళ్ళు తెరచి పైకి లేచి చూసే సరికి నాకు ముందు ఉన్న ఆ అమ్మాయి మరెవరో కాదు ప్రియ. అప్పుడే మొదటి సారి ప్రియని చూశాను. నేను కళ్ళు తెరిచాను అనే ఆనందం తన కళ్ళలో చాలా స్పష్టం గా కనిపించింది. తను ఎందుకు ఆనంద పడుతుందో అప్పుడు నాకు తెలియదు.
ఆమె నాతో కనిపిస్తున్నానా అని అడుగుతూ ఉంటే నేను అందుకు బదులుగా ‘కనిపిస్తున్నారు’ అని చెప్పాను.
నేను కళ్ళు తెరవగానే ప్రియ పక్కన ఉన్న మరో అమ్మాయి నాతో మాట్లాడుతూ ‘హమ్మాయ్ కళ్ళు తెరిచావా , తెలుసా .. నువ్వు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా అని రోజూ ఎదురు చూస్తూ ఉండేది ఈ ప్రియ , నిన్ను ఆ రోజు కార్ గుద్ది వెళ్ళిన తరువాత ఈ ప్రియనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి ఈ హాస్పిటల్ లో చేర్పించింది. అసలు నువ్వు ఎన్ని రోజులు స్పృహలోకి రాకుండా ఉన్నావో తెలుసా ఇప్పటికి 5 రోజులు అయింది’ అని చెప్పింది.
ఆ అమ్మాయి మాటలు విన్నాక అప్పుడు నాకు పూర్తిగా అర్ధమయిన విషయం ఏమిటి అంటే నేను అనుకున్నట్టు ఈ అమ్మాయే ఆ రోజు నన్ను కాపాడి ఇక్కడ చేర్పించింది అని. ఇక ఆ అమ్మాయి పేరు ప్రియ అని.. ఆ ప్రియనే ఇప్పుడు నా పక్కన ఉన్న ప్రియ” అని అంతవరకు జరిగింది సుధారాణి వాళ్ళతో చెప్పాను.
ఆ తరువాత నా పక్కన ఉన్న ప్రియ నాతో “అంత వరకు ఆపు రవి , ఆ 5 రోజులు ఎంజరిగిందో నేను చెపుతాను” అని నాతో చెప్పి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ “ మీకు తెలిసిందే కదా మా , వైజాగ్ లో నా మెడిసన్ కోర్సు కంప్లీట్ చేసుకున్న వెంటనే విజయవాడ gov హాస్పిటల్ లో డ్యూటి డాక్టర్ గా జాబ్ వచ్చి అక్కడకి వెళ్ళాను కదా . విజయవాడకి వెళ్లి ఒక హౌస్ రెంట్ కి తీసుకొని నా జాబ్ చేస్తూ చేస్తూ రెండు నెలల గడిచి పోయాయి . అలా గడుస్తుతండగా ఒక రోజు ఎప్పటిలా హాస్పిటల్ కి నా స్కూటీ లో వెళ్తున్నాను. అలా వెళ్తున్న నా పక్కనుంచి ఒక కార్ వేగంగా వెళ్ళి రోడ్డుకు పక్కగా వెళ్తున్న రవిని వెనుక నుంచి గుద్ది వెళ్ళిపోయింది.
వెంటనే నేను వెళ్ళి తనని చూసేసరికి తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే వెంటనే ఆంబులెన్స్ కి ఫోన్ చేసి నేను పనిచేసే gov హాస్పిటల్ లోనే జాయిన్ చేశాను . ఈ రవి పేరు కానీ , ఇతను పలానా అనే ఒక్క ప్రూఫ్ కూడా దొరకకపోవడంతో ఎవరికి inform చేయాలో తెలియలేదు.
ఆ తరువాత ఎవరైనా కావాలని రవిని గుద్దారా అని ఆరాతీస్తే , అప్పుడు నాకు తెలిసిన విషయం ఏమిటి అంటే – ఎవడో ఒకడు ఫుల్ గా డ్రింక్ చేసి కార్ నడిపి ఆ మత్తులో రవిని అనుకోకుండా గుద్దేశాడు అని తెలిసింది.
రవికి మరీ పెద్ద దెబ్బ తగలలేదు . కానీ అనుకోకుండా దెబ్బ తగలడం వలన షాక్ లోకి వెళ్ళి స్పృహ కోల్పోయాడు , అంతేకానీ కోమా లాంటి ప్రమాద స్తితి లేదు అని , రెండు మూడు రోజులలోనే స్పృహలోకి వస్తాడు అని నేను పనిచేసే హాస్పిటల్ లోని న్యూరో డాక్టర్ చెప్పాడు. ఇక రవిని వార్డ్ కి షిఫ్ట్ చేశారు. అప్పుడు రవి పేరు కూడా నాకు తెలియదు , అయినా రవిని , నేనే ఇక్కడ జాయిన్ చేశాను అనే ఒక కారణం వల్ల రోజూ వచ్చి చూసేదాన్ని. కొంత సేపు రవి పక్కనే కుర్చీలో కూర్చొని ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని తన గురించి ఆలోచిస్తూ ఉండేదాన్ని.
ఒక రోజు ఓవర్ టైమ్ డ్యూటి చేయడం వలన నా డ్యూటి అయ్యాక రవిని చూడకుండా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాను. ఆ రోజు నా మనసు నా అధీనంలో లేదు , వెళ్ళి రవిని చూడాలని ఒకటే తపన. ఇక లాబం లేదు అని ఫ్రెష్ అయ్యి అన్నం కూడా తినకుండా మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళి రవి దగ్గరికి వెళ్ళాను.
వాడిని చూశాక నా మనసు కాస్త కుదుట పడింది. ఇక ఆ క్షణం నుంచి నా మనసులో ఒకటే ప్రశ్న , ఊరు పేరు తెలియని ఒక అబ్బాయి కోసం అన్నం కూడా తినకుండా వచ్చేశానా ఎందుకు? అనే ప్రశ్న . ఆ విషయం గురించి బాగా ఆలోచించా . అప్పుడు తెలిసింది, రోజూ ఈ రవిని చూడడం అనే పని , నాకు తెలియకుండా ఒక అలవాటుగా అయింది అని. ఈ అలవాటు మంచిందో కాదో అస్సలు అర్ధం కాలేదు , ఈ రవి మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని వీడిని తదేకంగా చూడడం మొదలెట్టాను.
అలా చూస్తూ చూస్తూ చిన్నగా వీడితో ‘ఎవరు నువ్వు ? ఎందుకు నా కళ్ళకి కనిపించావు ? నువ్వు ఎందుకు అలవాటు అయ్యావు ? నువ్వు ఎప్పుడ కళ్ళు తెరుస్తావా అని ఎందుకు ఎదురుచూస్తూ ఉన్నాను ? ఇప్పటి దాకా ఎంతో మందికి ట్రీట్మెంట్ చేశాను కానీ నువ్వు ఎందుకు ప్రత్యేకంగా అనిపిస్తున్నావు? ఈ నా సందేహాలకి ఎవరు సమాదానం చెపుతారు?’అని మాట్లాడడం మొదలెట్టాను. ఈ రవికి వినబడతుందో లేదో కూడా ఆలోచించకుండా అలా కొంత సేపు నా మనసులో ఉన్న ఆలోచనలు , సందేహాలు వీడితో చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉంటే క్రమంగా నా మనసు చాలా తేలిక అయ్యింది. అలా అలా కొద్ది కొద్దిగా ఇంకా ఇంకా అలవాటు అయ్యాడు ఈ రవి.
అదే సమయంలో ఒక బయం వేసింది , తీరా రవికి మెలకువ వస్తే నా నుంచి దూరంగా వెళ్లిపోతాడేమో అని చాలా బయం బాద ఒకేసారి వేశాయి. నాకు ఏమీ కానీ ఈ అబ్బాయి కోసం ఇంతలా ఎందుకు బాద పడుతున్నానో నాకు తెలియక చాలా confuse అయ్యా. చివరకి ఏది జరుగుతుందో అదే జరుగుతుంది అని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను.
చూస్తుండగా 4 రోజులు పూర్తయ్యాయి. మరుసటి రోజు ఉదయాన్నే నేను నా కొలీగ్ కలిసి న్యూరో వార్డ్ లో ఉన్నాము, అందరినీ చూసుకుంటూ చివరికి రవి దగ్గరకి వచ్చి రవిని చెక్ చేస్తూ ఉంటే అప్పుడు రవి మెల్లగా కదులుతూ కళ్ళు తెరచి నన్ను చూసాడు.
ఎప్పుడైతే రవి కళ్ళు తెరుస్తున్నాడు అని నేను చూశానో చాలా సంతోషం వేసింది . అదే టైమ్ లో రవి కంటి చూపు కనిపిస్తుందో లేదో తెలుసుకోవాలని తనతో మాట్లాడుతూ ‘నేను కనిపిస్తున్నానా ? నా మాటలు వినిపిస్తున్నాయా ?’ అని అంటూ ఉండగా రవి ఇక ఏమీ మాట్లాడకపోయేసరికి మొదట బయం వేసింది కానీ కొద్ది సేపటికి ‘హా కనిపిస్తున్నారు’అని అన్నాడు . రవి మాటలు విని చాల సంతోషంతో మా చీఫ్ డాక్టర్ దగ్గర్ ని తీసుకురాదనికి నేను వెళ్ళాను” అని ప్రియ నాతో పాటు తన వాళ్ళకి కూడా చెప్పింది.
ఆ తరువాత నేను చెప్పడం మొదలుపెడుతూ “నేను కళ్ళు తెరచి తను కనిపించింది అని చెప్పిన తరువాత ప్రియ ఎక్కడికో వెళ్ళి కొద్ది సేపటికే ఒక డాక్టర్ ని తీసుకొచ్చింది. ఆయన వచ్చి నన్ను చూసి ప్రియతో ‘ఎలాంటి సమస్య లేదు ప్రియ , కానీ కొన్ని టెస్ట్ లు చేయించాలి’ అని చెప్పి ఏవో రాసి నాతో ‘నీకు అంతా బాగుంది మిస్టర్ కొద్ది రోజులలో నువ్వు ఇంటికి వెళ్లిపోవచ్చు’ అని నాతో చెప్పి తను వెళ్ళిపోయాడు.
ఆ తరువాత ప్రియ , ఆ డాక్టర్ చెప్పిన టెస్ట్ లు అన్నీ తనే దగ్గర ఉండి మరి చేయించింది. ఆ టెస్ట్ లు చేయించే సమయంలో మొదటిసారిగా నా పేరు రవి అని ప్రియ తెలుసుకుంది . రేపోర్ట్స్ రాడానికి ఒక రోజు పడుతుంది అని చెప్పడంతో నన్ను తిరిగి వార్డ్ కి తీసుకొచ్చి నా మంచం పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని మొదటిసారిగా నా గురించి అడుగుతూ ‘ఇక చెప్పండి రవి గారు మీ వాళ్ళు ఎవరు , ఎక్కడ ఉంటారో అది చెపితే వాళ్ళకి మీ పరిస్తితి గురించి చెపుతాను’ అని చెప్పింది.
అప్పుడు తనతో మాట్లాడుతూ ‘నా చిన్నప్పుడే నా అమ్మా నాన్న చనిపోయారు . నాకంటూ ఎవరు లేరండి , నేను పుట్టి పెరిగింది అంతా వైజాగ్ లోనే కానీ అక్కడ నాకంటూ ఏమీ లేదు. ఇక్కడ క్యాటరింగ్ చేసే వాళ్ళకి పనివాళ్ళు కావాలి అని తెలిసి ఇక్కడికి వచ్చాను. వాళ్ళ దగ్గరికి వెళ్తుంటేనే ఇలా ఎవరో నన్ను గుద్ది వెళ్లిపోయారు’ అని చెప్పాను.
ఆ తరువాత ప్రియ నాతో ‘ఆ చెప్పడం మర్చిపోయాను మిమ్మల్ని ఎవరైనా కావాలని గుద్దారో అని సందేహం వచ్చి ఎంక్వయిరీ చేయించాను. చివరకు తెలిసిన విషయం ఏమిటి అంటే మిమ్మల్ని ఎవరూ కావాలని గుద్దలేదు , మిమ్మల్ని కార్ తో గుద్దిన ఆ వ్యక్తి బాగా డ్రింక్ చేసి మత్తులో అనుకోకుండా గుద్దాడు అని తెలిసింది’ అని చెప్పింది.
ప్రియ చెప్పింది విన్నాక అప్పుడు నేను ‘అంతేలేండి , నన్నెవరూ కావాలని గుద్దరు’ అని చెప్పాను. ఆ తరువాత ప్రియ నాతో ‘సో నీ కంటూ ఎవ్వరూ లేరా .. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు?’ అని అడిగింది అందుకు బదులుగా ‘నన్ను హాస్పిటల్ నుంచి పంపించిన తరువాత ఎక్కడ ఉండాలో చూడాలి , ఏ పని కోసం అయితే ఇక్కడికి వచ్చానో ఆ పని ఇంకా నాకోసం ఉంటే అక్కడికి వెళ్ళాలి . లేకపోతే ఆ తరువాత ఆలోచించాలి’ అని చెప్పాను.
ఆ తరువాత ప్రియ ‘మీరు చదువు కున్నారా ? ఒకవేల చదువుకొని ఉంటే ఎంతవరకు చదివారు ?’ అని అడిగి అడిగింది. అందుకు బదులుగా ‘హా డిగ్రీ దాకా చవివాను’అని చెప్పాను. ఆ తరువాత నాతో ‘ ఓ డిగ్రీ దాకా చదివారా. సరే అయితే నాదో మాట . అది కూడా మీకు ఇష్టం అయితేనే . మీరు ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళే లోపల నన్ను ఒక జాబ్ చూడమంటారా’ అని అడిగింది.
అందుకు ‘నేను ఎవరో తెలియకపోయిన కూడా నాకు జాబ్ చూస్తాను అని అంటున్నారు మీరు చాలా గొప్ప వారు మేడమ్ , మీకు ఇబ్బంది లేదు అని అంటే మీరు అన్నట్టు నాకు జాబ్ చూడండి’ అని చెప్పాను. నా మాటలు విని ఆమె వెంటనే చాలా చిత్రంగా నాతో ‘హలో ఏంటి మేడమ్ అని అంటున్నారు నేనేమీ మీకాన్న పెద్ద కాదు , కాబట్టి మేడమ్ అని పిలవకండి’అని అనింది
కానీ నేను ప్రియ తో ‘అది కాదండీ మీరు డాక్టర్ కదా అందుకే మేడమ్ అని అన్నాను’ అని అంటే ప్రియ ‘అయితే ఎం అసలు నేను మీకన్నా వయసులో చిన్న తెలుసా , ఇందాక టెస్ట్స్ కోసం మి date – of birth చెప్పారుగా , అప్పుడు తెలిసింది నేను మీకన్న మూడు నెలలు చిన్న దాన్ని . మరి నన్ను మేడమ్ అని పిలవడం బాలేదు . నన్ను పేరు పెట్టి పిలవండి ,నా పేరు తెలుసుగా ప్రియ’ అని చెప్పింది.
ప్రియ అలా అంటూ ఉంటే వింత అనిపిస్తూ తనతో ‘పేరు పెట్టి పిలవాలి , అంటే కొద్దిగా కష్టం’
‘అయితే , నేను కూడా మిమ్మల్ని సర్ అని పిలుస్తా ఒకే నా’
‘అయ్యో అలా వద్దు’
‘హుం … కాబట్టి నేను కూడా నిన్ను రవి అని పిలుస్తా నువ్వు కూడా ప్రియ అని పిలువు సరేన’ అని చెప్పింది. అప్పుడు ప్రియ అలా చెపుతూ ఉంటే కొంత సేపు మౌనంగా ఉండేసరికి తనే మళ్ళీ నాతో ‘ఏంటి సమాదానం చెప్పకుండా ఇంకా ఏదో ఆలోచిస్తున్నావ్ . పిలిస్తే ప్రియ అని పిలువు లేదంటే అస్సలు మాట్లాడకు’అని చెప్పి , నేను సమాదానం చెప్పలేదు అని బుంగ మూతి పెట్టి నా వైపు చూడకుండా పక్కకి చూస్తూ ఉంది.
తనకి ఏమీ కానీ నా మీద ప్రియ అలగడం నాకు వింతగా అనిపించింది. దాంతో పాటు ఎందుకో తనని దూరం చేసుకోకు అని నా మనసు నాకు చెపుతూ ఉండడంతో, తను చెప్పినట్టు తనని ప్రియ అని పిలవాలని అని నిర్ణయించుకొని ప్రియతో ‘సరే ప్రియ , నువ్వు చెప్పినట్టు పేరు పెట్టె పిలిస్తా .. నువ్వు కూడా నన్ను పేరు పెట్టి రవి అని పిలువు’ అని చెప్పాను.
నేను తనని ప్రియ అని పిలవడమే ఆలస్యం, అప్పటిదాకా అలక మీద ఉన్న ప్రియ ఒక్కసారిగా చాలా చక్కగా నవ్వుటు నాతో ‘హుం అలా రా దారికి ఇక మేడమ్ అని , మీరు అని అస్సలు పిలవకు’ అని నాతో చెప్పి , మళ్ళీ నాతో ‘ఉండు రవి నీకోసం ఇడ్లీ తీసుకొస్తా చాలా ఆకలిగా ఉంటావు’ అని చెప్పి తను ఇడ్లీ తీసుకురాడానికి వెళ్ళింది.
నా మీద ప్రియ చూపిస్తున్న శ్రద్ద ని నేను గమనిస్తూ ఉంటే నాకంటూ ఒక అమ్మాయి వచ్చిందేమో అని ఒక వైపు సంతోషం గా ఉంది . అదేసమయంలో , ఆశించని దాని కోసం నేనేమైనా ఆశ పడుతున్నానేమో అనే సందేహం మరో వైపు ఉంది. ఆ రెండిటి మద్య ఏమి చేయాలో తోచని స్తితిలో నేను ఉండగా కొద్ది సేపటికి ప్రియ నా దగ్గరకి ఇడ్లీ తీసుకొని వచ్చింది.
తనే చేతులలతో నాకు తినిపించాలని చిన్న పిల్లలా మారం చేసింది , వద్దు అని నేను అంటూ ఉంటే నా మాట వినకుండా , నా మీద అధికారం చూపిస్తూ తన మాట నెగ్గిచ్చుకుంటూ నాకు ఇడ్లీ తినిపించింది” అని అంతవరకు చెప్పాను.
నా మాటలు విన్నాక ఉమ గారు మాట్లాడుతూ “కలిసి ఎక్కువ సేపు కాలేదు అప్పుడే తన చేత్తో తినిపించే చొరవ చనువు ఎందుకు చూపింది అల్లుడు నికేమైన చెప్పిందా” అని నన్ను ప్రశ్నించింది. ఆ ప్రశ్న కి బదులుగా ప్రియ మాట్లాడుతూ “నీ ప్రశ్నకి సమాదనం నేను చెపుతా మా ” అని చెప్పి తను చెప్పడం మొదలెట్టింది.
ప్రియ మాట్లాడుతూ “నువ్వు అడిగిన ప్రశ్న సరిగ్గానే ఉంది మా , రవికి నేను పరిచయం అయి కొద్ది గంటలే అయింది కానీ, నాకు రవి పరిచయం అయి 4 రోజులు పూర్తయింది. ఇదివరకే చెప్పానుగా రోజూ రవిని చూడడం నాకు ఒక అలవాటుగా మారింది అని .ఆ అలవాటు కాస్త , రవి మీద ఇష్టానికి దారి తీసింది.
ఎప్పుడైతే రవికీ ఎవరూ లేరు అని తను చెప్పాడో – ఆ క్షణం నా నుంచి రవి ఎక్కడికీ వెళ్ళడు , అనే ధీమా కలిగి , ఎవరూ లేని తనకు అన్నీ నేను కావాలని , నేనే రవికి మొదటి దాన్ని కావాలనే ఒక ఆశ మొదలైంది. ఆ ఆశతోనే తన అనుమతి కూడా తీసుకోకుండా చనువుగా నా చేత్తో తనకి తినిపించాను” అని చెప్పింది.
ప్రియ మాటలు విన్నాక దివ్య “అంటే నీకు తెలియకుండానే రవి బావ మీద ఇష్టం ఏర్పడిందా సూపర్ … ఇక ఆ ఇష్టం ప్రేమగా ఎప్పుడు మారిందో త్వరగా చెప్పు అక్కా” అని అడిగింది. ఆ వెంటనే సుశీల అన్విత కూడా చెప్పమని చెప్పారు. ఆ వెంటనే సుధారాణి నాతో మాట్లాడుతూ “అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రియ కోసమే బయటపడ్డట్టు ఉంది రా రవి … ఆ తరువాత ఎం జరిగిందో చెప్పు” అని తను కూడా అడగడంతో ఆ తరువాత జరిగిన విషయాలు చెప్పడం మళ్ళీ మొదలుపెట్టాను.
కంటెన్యూ 👉🔥 కసిరాజా హాట్ స్టోరీస్ 🔥
Discover more from Boothu Kathalu
Subscribe to get the latest posts sent to your email.